ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు పాత్రపై మండిపడ్డ అమెరికా సెనెటర్లు
- December 05, 2018
వాషింగ్టన్ : సౌదీ జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు పాత్ర వుందని సిఐఎ నిర్ధారించిన తర్వాత తాము ఈ విషయంలో మరింత స్పష్టతకు వచ్చామని అమెరికా సెనెటర్లు తెలిపారు. ఈ కేసులో యువరాజు బిన్ సల్మాన్ జోక్యంపై తనకు చాలా నమ్మకం వుందని సెనెటర్ లిండ్సే గ్రాహమ్ వ్యాఖ్యానించారు. యువరాజు సల్మాన్ చాలా ప్రమాదకరమైన వ్యక్తని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ హత్యలో 11మందిపై సౌదీ అభియోగాలు మోపింది. కానీ యువరాజు పాత్రను తోసిపుచ్చింది. సిఐఎ డైరెక్టర్ గినా హాస్పెల్ మంగళవారం చేసిన ప్రకటన తర్వాత విదేశీ సంబంధాలపై సెనెట్ కమిటీ సభ్యులకు మాటలేమీ మిగల్లేదు సౌదీ యువరాజు అధికారంలో వున్నంతవరకు ఎమెన్ యుద్ధంలో సౌదీ అరేబియా పాత్ర లేదా సౌదీకి ఆయుధ అమ్మకాలను తాను సమర్దించనని గ్రాహమ్ స్పష్టం చేశారు. మరో సెనెటర్ బాబ్ మెనెండెజ్ కూడా ఇవే అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇటువంటి చర్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కావని అమెరికా స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. సౌదీ యువరాజు వ్యవహారంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని, జ్యూరీ ముందు నిలుచుంటే ఆయనను దోషిగా నిర్ధారించడానికి కేవలం అరగంట సరిపోతుందని మరో సెనెటర్ బాబ్ కార్కర్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







