బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో సెలబ్రిటీల సందడి
- December 07, 2018
రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీస్, సామాన్యులు..ఇలా ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సిని నటులు, రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాలు సెలబ్రిటీలతో సందడిగా మారాయి.
అందరికీ అనుకూలంగా ఉండేవాడే లీడర్ అన్నారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన తన తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటేశారు. మంచి లీడర్లనే కోరుకుంటున్నామని.. అందరూ తప్పకుండూ ఓటేయాలన్నారు జూనియర్ ఎన్టీఆర్.
* ఓటు హక్కు వినియోగించుకేనేందుకు సాధారణ ప్రజానికంతో పాటు ప్రముఖులు తరలిస్తున్నారు. నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
* జూబ్లీహిల్స్‌లో నటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు. ఓటర్ల క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అన్నారు ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్.. ఓటు విషయంలో బద్దకం పనికిరాదని.. ఓటు వేస్తే జీవితంలో చాలా మంచి జరుగుతుందంటున్నారు రాజేంద్రప్రసాద్.
* జూబ్లీహిల్స్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్లోని పోలింగ్ బూత్ నెంబరు 19లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజమౌళి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







