న్యూయార్క్‌లో బాంబు కలకలం, నిలిచిపోయిన సిఎన్‌ఎన్ ప్రసారాలు
- December 07, 2018
న్యూయార్క్ : న్యూయార్క్‌లోని టైమర్ వార్నర్ సెంటర్ బిల్డింగ్‌లో ఐదు బాంబులను అమర్చినట్లు ఓ ఫోన్‌కాల్ రావడంతో అక్కడ సమీపంలోని కేబుల్ న్యూస్ నెట్‌వర్క్(సిఎన్‌ఎన్) ప్రసార కార్యాలయాల భవనాన్ని పోలీసులు గురువారం రాత్రి ఖాళీ చేయించారు. దీంతో ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కలకలంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించామని, గాలింపు చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను, పాదచారులరు సైతం తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కాల్ వచ్చిందని, దీంతో న్యూస్ చానల్ ప్రసారాలను నిలిపివేసి, భవనం నుండి ఉద్యోగులను సురక్షితంగా వెలుపలకు పంపించామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







