హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా ప్రవేశంపై పిటిషన్‌ దాఖలు

- December 07, 2018 , by Maagulf
హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా ప్రవేశంపై పిటిషన్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఔలియా దర్గా గర్భగుడిలోకి మహిళలను ప్రవేశానికి అనుమతినివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పుణెకు చెందిన లా మహిళ విద్యార్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నవంబర్‌ 27న దర్గాను సందర్శించిన సమయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించే విధంగా వెలుపల ఒక నోటీసు బోర్డును ఉంచారని పిటిషన్‌ పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దర్గాలో మహిళల ప్రవేశాన్ని నిర్దారించే మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, దర్గా ట్రస్ట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌ కోరింది. నిజాముద్దీన్‌ దర్గా బహిరంగ ప్రదేశమని, లింగ బేధా ఆధారంగా ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించడం రాజ్యాంగ ముసాయిదాకి విరుద్ధమని పేర్కొంది. లా విద్యార్థుల తరుపున న్యాయవాది కమలేష్‌ కుమార్‌ మిశ్రా పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల శబరిమలలో మహిళందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా, హజీ అలీ దర్గాలో మహిళలను అనుమతించడాన్ని కూడా పిటిషన్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com