ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్!
- December 23, 2015
ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్ తో ముందుకు రాబోతోంది. దీనికోసం గూగుల్ సంస్థ దాదాపు ఏడాది కాలంగా తీవ్రంగా కసరత్తులు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం తెలిపింది. గూగుల్ మెసేజింగ్ యాప్ 'హ్యాంగౌట్' ఆశించినంత మేర యూజర్లను ఆకట్లుకోకపోవటంతో గూగుల్ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ యాప్ లో ఫేస్‌బుక్‌ను తలదన్నేలా యూజర్లకు అన్నిరకాల ఫీచర్లను అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉండే ఫీచర్లను, వెబ్ పేజ్ లింక్ లు యూజర్లకు యాప్ లో అందుబాటులో ఉండేలా గూగుల్ దీన్ని రూపొందిస్తోంది. ఇటీవలి మొబైల్ ఫేస్ బుక్ లోని ఫీచర్ల కంటే అడ్వాన్స్ గా గూగుల్ ఈ యాప్ ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నా.. ఇది ఎప్పటికి అందుబాటులోకి రానుందనే విషయం మాత్రం తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







