బెగ్గింగ్‌: టూరిస్ట్‌ ఫ్యామిలీ అరెస్ట్‌

- December 08, 2018 , by Maagulf
బెగ్గింగ్‌: టూరిస్ట్‌ ఫ్యామిలీ అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, బెగ్గింగ్‌ అలాగే మహిళా డ్రైవర్లను వేధిస్తున్న కేసులో టూరిస్ట్‌ ఫ్యామిలీని అరెస్ట్‌ చేయడం జరిగింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - అల్‌ దహిరా గవర్నరేట్‌ పోలీస్‌ నుంచి అందిన సమాచారం నేపథ్యంలో అరబ్‌ కుటుంబాన్ని కారుతో సహా అరెస్ట్‌ చేశారు. ఈ కుటుంబం, రోడ్లపై వెళ్ళే కార్లను ఆపి, అందులో ప్రయాణిస్తున్నవారిపై ఒత్తిడి చేసి డబుబ్లఉ తీసుకుంటుండడం, డబ్బులు ఇవ్వకపోతే వేధింపులకు గురిచేయడం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విజిట్‌ వీసాపై ఈ కుటుంబం ఒమన్‌కి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com