రిస్క్ తీసుకున్న హీరో కల్యాణ్‌రామ్
- December 09, 2018
హైదరాబాద్:కథానాయకుడు కల్యాణ్ రామ్ రిస్క్ తీసుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమా '118'. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. నివేదా థామస్, షాలిని పాండే కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ రిస్కీ సన్నివేశాల్లో నటిస్తున్నారట. ఇందు కోసం ఆయన నీటిలోతులోకి వెళ్లి ఈత కొట్టేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ మేరకు తీసిన వీడియోను నిర్మాత మహేశ్ కోనేరు ట్విటర్‌లో షేర్ చేశారు. కల్యాణ్‌రామ్ '118' కోసం ఏం చేస్తున్నారో ఊహించండి? అని ప్రశ్నించారు. అనంతరం 'కల్యాణ్‌రామ్ '118' సినిమాలోని వాటర్ సీక్వెన్స్ కోసం నీటిలో డీప్ డైవ్ చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కల్యాణ్‌రామ్‌ను ప్రశంసించారు. చాలా కష్టపడుతున్నారని, వృత్తిపట్ల అంకితభావం ఎక్కువని.. కామెంట్లు చేశారు. అంతేకాదు ఊపిరి ఆపుకుని ఉండటం ప్రమాదమని, జాగ్రత్తగా ఉండమని కోరారు.
'118' ట్రెండీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారట. కల్యాణ్‌రామ్ ఇటీవల 'నా నువ్వే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమన్నా కథానాయిక. జయేంద్ర దర్శకుడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







