అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కేరళ

- December 09, 2018 , by Maagulf
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కేరళ

కేరళ:దేశంలోకెల్లా ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు కల్గిన రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. కన్నూరులో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌లు ప్రారంభించారు. ఈ విమానాశ్రయంతో కేరళలో ఇంట ర్నేషనల్ ఎయిర్‌పోర్టుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రంగా కేరళ నిలిచింది.

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అనంతరం మొదట రెండు విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌ కన్నూరు నుంచి అబుధాబికి సర్వీస్ నడిపింది. గోఎయిర్ విమానయాన సంస్థ కన్నూరు నుంచి బెంగళురుకు తన సర్వీసు ప్రారంభించింది. ఇన్నాళ్లూ కోజికోడ్ ఎయిర్‌పోర్టుపై ఆధారపడిన పరిసర గ్రామాలకు ప్రజలు, ఇప్పుడు కన్నూరు ఎయిర్‌పోర్టు సేవలను వినియోగించుకునే అవకాశం లభించింది.

కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును 18వందల కోట్ల వ్యయంతో 2వేల ఎకరాల్లో నిర్మించారు. ఏడాదికి 15 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయ సేవలు ఉయోగించుకుంటున్నారని అంచనా. ఇక, కేరళలో ఇప్పటికే రాష్ట్ర రాజధాని తిరువనంతపురంతో పాటు కోచి, కోజికోడ్‌లలో అంతర్జాతీయ విమానాశ్రయలున్నాయి. కన్నూరు ఎయిర్ పోర్టు రాకతో ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com