బిళ్ళల పులుసు

- May 10, 2015 , by Maagulf
బిళ్ళల పులుసు

ఈరోజు ఒక వైవిధ్యమైన వంటకం తో మీ ముందుకు వచ్చాం. తెలంగాణా వారి ప్రత్యేకం. అదే ‘బిళ్ళల పులుసు’. దీనినే ‘వెజ్ చేపల కూర’ అని కూడా అంటారు. మరి తయారీ ఎలాగో చూసేద్దామా..!

 

కావలసిన పదార్ధాలు:

  • ఉల్లిపాయలు             - 2 లేక 3 పెద్దవి
  • జీలకర్ర                      - 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి ముద్ద      - 1 టేబుల్ స్పూను
  • ఉప్పు                       - తగినంత
  • పచ్చికారం                  - సరిపడా
  • శనగపిండి                  - 1 కప్పు
  • మెంతి పొడి                - 1/2 టేబుల్ స్పూను
  • ధనియాల పొడి           - 1 టేబుల్ స్పూను
  • చింతపండు రసం         - 3 టేబుల్ స్పూన్లు
  • బెల్లం                       - కొద్దిగా
  • కరివేపాకు                  - కొద్దిగా
  • కొత్తిమీర                   - కొద్దిగా
  • నీరు                         - 1 1/2 కప్పు

 

చేయు విధానం:

 

బిళ్ళలు:

  • ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేపండి.
  • ఇప్పుడు నీళ్ళు, ఉప్పు, పచ్చికారం వేసి కాగనివ్వండి.
  • శనగపిండి ని చల్లటి నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న నీటిలో మెల్లిగా ఉండలు కట్టకుండా చూసుకుంటూ వేయాలి. మూకుడు అంచులకి శనగపిండి అంటనంతవరకు ఉడికించి స్టవ్ మీద నుండి దించేయాలి.
  • ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ కి నూనె/నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేయండి. చల్లారాక, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోండి.

పులుసు:

  • ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయండి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెళ్లి ముద్ద, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాక వేయించండి.
  • ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా మరగనివ్వండి.
  • ఉప్పు, మెంతి పొడి, పచ్చికారం, ధనియాల పొడి, బెల్లం వేసి ఒక 5-7 నిమిషాలు మరగనివ్వండి.
  • ముందుగా చేసుకున్న బిళ్ళలు ఇందులో మెల్లిగా వేసి మరి కాసేపు అనగా 2-3 నిమిషాలు మరగనిచ్చి, స్టవ్ మీద నుండి దించి కోత్హిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే.

ఇది అన్నంతో మరియు రోటి తో బాగుంటుంది.

 

------ పి.రమ్య, దుబాయ్, యు ఏ ఈ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com