బ్రెగ్జిట్‌పై యూరోపియన్ కోర్టు రూలింగ్
- December 11, 2018
లండన్ : బ్రెగ్జిట్ క్రమం నుంచి బ్రిటన్ కావాలంటే ఏకపక్షంగా వైదొలగవచ్చని యురోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ ( ఇసిజే) సోమవారం రూలింగ్ ఇచ్చింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే మంగళవారం బ్రెగ్జిట్‌పై హౌస్ ఆఫ్ కామన్స్‌లో కీలకమైన ఓటింగ్‌ను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. ఇయు సభ్య దేశం ఏదైనా ఈ క్రమానికి సంబంధించిన 50వ అధికరణను మరో సభ్య దేశం ఆమోదం లేకుండా కొట్టివేయవచ్చని కోర్టు తెలిపింది. ఇతర 27 ఇయు సభ్యుల అనుమతి లేకుండానే బ్రెగ్జిట్ క్రమాన్ని బ్రిటన్ రద్దు చేసుకోవచ్చు. ఇయు నుంచి వైదొలగాలన్న తన ఉద్దేశ్యాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందని, బ్రిటన్ సభ్యత్వానికి సంబంధించిన షరతులు, నియమ నిబంధనలను మార్చకుండానే ఇది చేసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇయు నుంచి వైదొలగే ఒప్పందం అమల్లోకి రానంతవరకు సభ్య దేశానికి తన వైఖరి మార్చుకునే అవకాశం ఉంటుందని ఇసిజె పేర్కొంది. ఈయూకి తెలియచేసిన తర్వాత రెండేండ్ల కాలంలో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో, బ్రిటన్ పార్లమెంట్ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇయుకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎంపీలకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, మంగళవారం నాటి ఓటింగ్‌కు ముందు ఈసీజే ఈ రూలింగ్ వెలువడింది. వచ్చే ఏడాది మార్చి29 నాటికి ఇయు నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







