ఒహియో:అగ్నిప్రమాదం..5 మంది చిన్నారులు మృతి
- December 10, 2018
యూఎస్ : ఒహియోలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంతో ఏం చేయాలో తోచని ఆ చిన్నారుల తల్లి డెబొరా రివెరా..మంటల బారి నుంచి తప్పించుకునేందుకు రెండో అంతస్తుపై నుంచి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతి చెందిన చిన్నారుల్లో ఇద్దరు కవలలున్నారు. చిన్నారులంతా 9 ఏండ్లలోపు వారే. డెబొరా రివెరా తన కుటుంబంతో కలిసి 6 నెలల క్రితమే ప్రమాదం జరిగిన ఇంటిలోకి మారింది. అగ్నిప్రమాదం జరిగిన ఇళ్లు 90 ఏండ్ల క్రితం చెక్కతో కట్టబడిందని ఆమె స్నేహితుడు జస్టిన్ వీరా తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







