ఫలితాల ఎఫెక్ట్ తో భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
- December 11, 2018
ముంబయి: ఈరోజు కూడా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం తదితర కారణాలతో సోమవారం భారీగా నష్టపోయి మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా నష్టాలతోనే ఆరంభించాయి. నిన్న సాయంత్రం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే నేడు వెలువడుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టపోయి 10370 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్ 507 పాయింట్ల నష్టంతో 34452.63 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 115.4 పాయింట్ల నష్టంతో 10373 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.29 వద్ద కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







