వైద్యానికి గ్యారంటర్ తప్పనిసరి
- December 12, 2018
కువైట్ సిటీ: హెల్త్ మినిస్ట్రీ, వలసదారుల నుంచి మెడికల్ ఫీజుల వసూళ్ళకు సంబంధించి సర్క్యులర్‌ని జారీ చేసింది. ఖరీదైన వైద్యాన్ని భరించలేని వలసదారులు, ఫీజులు చెల్లించడంలేదని మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అలాంటివారికి గ్యారంటీటర్ తప్పనిసరి అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సర్క్యూలర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే, ఆసుపత్రిలో చేరే ముందే పేషెంట్, గ్యారంటీటర్‌ని పరిచయం చేయాల్సి వుంటుంది. వారిద్దరి పూర్తి వివరాలు తీసుకున్నాకే వైద్య చికిత్స ప్రారంభమవుతుంది. ఒకవేళ పేషెంట్, ఆసుపత్రి ఫీజు చెల్లించకపోతే, గ్యారంటీటర్ బాధ్యత తీసుకోవాల్సి వుంటుంది. గ్యారంటీటర్ చేతులెత్తేస్తే, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







