దొంగల ముఠా అరెస్ట్‌

- December 12, 2018 , by Maagulf
దొంగల ముఠా అరెస్ట్‌

బహ్రెయిన్‌: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అరెస్ట్‌ చేసినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ వెల్లడించడం జరిగింది. అరెస్టయినవారిలో ఇద్దరు ఇరానియన్స్‌ వున్నారు. జ్యుయెలరీ, ఖరీదైన వాచ్‌లు, మొబైల్‌ ఫోన్లను దొంగిలించడంలో ఈ ముఠా దిట్ట అని అధికారులు తెలిపారు. 50,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన వస్తువుల్ని వీరు దొంగిలించారు. బైసికిలింగ్‌ ఔత్సాహికులుగా ముగ్గురు వ్యక్తులు వ్యవహరిస్తూ, దొంగతనం కోసం ఇళ్ళను ఎంపిక చేస్తారనీ, మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేస్తుంటారనీ, ఆ తర్వాత అందరూ జాగ్రత్తగా జారుకుంటారనీ పోలీసులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com