హైదరాబాద్ లో భారీ వర్షం ..
- December 14, 2018
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వర్షం తెల్లవారు జామున వరకు కురిసింది. ఉదయం వర్షం తేరుకోవడం తో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్న వారి వారి పనులకు వెళ్లడం చేసారు.
సికింద్రాబాద్, బేగంపేట, సనత్ నగర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, ఎల్‌బీనగర్, ఉప్ప ల్ , మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యం గా నెల్లూరు , శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలియజేసింది. సముద్ర వేట కు కూడా వెళ్లోద్దని హెచ్చరించింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు వర్షాల గురించి ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







