వీకెండ్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌

వీకెండ్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌

మస్కట్‌:సుల్తానేట్‌ వ్యాప్తంగా లో ప్రెజర్‌ సిస్టమ్‌ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ప్రధానంగా నార్తరన్‌ పార్ట్స్‌లో వర్షం ఎక్కువగా కురవనుందని మిటియరాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవిఏషన్‌ మిటియరాలజీ స్పెషలిస్ట్‌ మొహమ్మద్‌ అల్‌ సియాబీ చెప్పారు. అల్‌ హజార్‌ మౌంటెయిన్స్‌లో ఎక్కువగా వర్షం కురవనుందని, అలాగే అల్‌ దహిరాహ్‌లో కూడా వర్షం కురవవచ్చుననీ, సౌత్‌ మరియు నార్త్‌ బతినాలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌ కోసం వెళ్ళేవారు ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా వుండాలి. 

Up to 50% discount on groceries at these stores across UAE
యూఏఈలో గ్రాసరీస్‌పై 50 శాతం డిస్కౌంట్‌ 
యూనియన్‌ కూప్‌, 47వ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌ని భారీ ఆఫర్స్‌తో ప్రకటించింది. నేషన్‌ వైడ్‌గా 14 బ్రాంచీలలో 25,000కు పైగా ప్రోడక్ట్స్‌పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వినియోగదారులకు 50 నుంచి 60 శాతం డిస్కౌంట్స్‌ని అందిస్తున్నట్లు యూనియన్‌ కూప్‌ సిఇఓ ఖాలిద్‌ అల్‌ ఫలాసి చెప్పారు. డిసెంబర్‌ 13 నుంచి 17 వరకు యూనియన్‌ కూప్‌ ఈ ఆఫర్‌ని ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌, బచ్చరీ, రోస్టరీ, స్పైస్‌ కౌంటర్‌పై అందిస్తోంది. వేలాది దిర్హామ్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ని బహుమతులు కూడా అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు యూనియన్‌ కూప్‌ బ్రాంచీలను వినియోగదారులు సంప్రదించవచ్చు. ఉమ్‌ సకీమ్‌, అల్‌ సఫా, అల్‌ తవార్‌ బ్రాంచీలు 24 గంటలూ తెరిచే వుంటాయి. మొత్తం 47 రోజుల ప్రమోషన్‌లో 100 మిలియన్‌ పైగా ఐటమ్స్‌ విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు అల్‌ ఫలాసీ చెప్పారు. 

Illegal expats held in Kabad
కబాద్‌లో అక్రమ వలసదారుల అరెస్ట్‌ 
కువైట్‌ సిటీ: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ అధికార ప్రతినిథి అస్సెన అల్‌ మాజ్యెద్‌, కబాద్‌లో ఇన్‌స్పెక్షన్స్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాంపెయిన్‌లో నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేస్తోన్న 21 మంది ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌, 13 మంది డొమెస్టిక్‌ వర్కర్స్‌ని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. టీమ్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, క్యాంపెయిన్‌ని కొనసాగిస్తున్నారనీ, లేబర్‌ చట్టం అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు అల్‌ మజ్యెద్‌. 

Back to Top