యూఏఈలో గ్రాసరీస్‌పై 50 శాతం డిస్కౌంట్‌

యూఏఈలో గ్రాసరీస్‌పై 50 శాతం డిస్కౌంట్‌

యూనియన్‌ కూప్‌, 47వ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌ని భారీ ఆఫర్స్‌తో ప్రకటించింది. నేషన్‌ వైడ్‌గా 14 బ్రాంచీలలో 25,000కు పైగా ప్రోడక్ట్స్‌పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వినియోగదారులకు 50 నుంచి 60 శాతం డిస్కౌంట్స్‌ని అందిస్తున్నట్లు యూనియన్‌ కూప్‌ సిఇఓ ఖాలిద్‌ అల్‌ ఫలాసి చెప్పారు. డిసెంబర్‌ 13 నుంచి 17 వరకు యూనియన్‌ కూప్‌ ఈ ఆఫర్‌ని ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌, బచ్చరీ, రోస్టరీ, స్పైస్‌ కౌంటర్‌పై అందిస్తోంది. వేలాది దిర్హామ్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ని బహుమతులు కూడా అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు యూనియన్‌ కూప్‌ బ్రాంచీలను వినియోగదారులు సంప్రదించవచ్చు. ఉమ్‌ సకీమ్‌, అల్‌ సఫా, అల్‌ తవార్‌ బ్రాంచీలు 24 గంటలూ తెరిచే వుంటాయి. మొత్తం 47 రోజుల ప్రమోషన్‌లో 100 మిలియన్‌ పైగా ఐటమ్స్‌ విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు అల్‌ ఫలాసీ చెప్పారు. 

Back to Top