అమ్మాయి భవిష్యత్తుకి ఆధారం..సుకన్య సమృద్ధి యోజన స్కీం

- December 14, 2018 , by Maagulf
అమ్మాయి భవిష్యత్తుకి ఆధారం..సుకన్య సమృద్ధి యోజన స్కీం

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడమో, లేదా వివిధ పథకాలు, పెట్టుబడి స్కీముల్లో మదుపుచేయడమో చేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి యోజనను ప్రవేశ పెట్టింది. ఈ స్కీములో పొదుపు చేసే వారికి ఒక శుభవార్త ఈ పథకంలో వడ్డి రేటును 8.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2015 జనవరిలో బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్ లో భాగంగా ఈ స్కీంను కేంద్రం ప్రవేశ పెట్టింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ స్కీం నిజంగా ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూద్దాం.

- ADVT -

 
ప్లానింగ్ తోనే విజయం :
అభిషేక్ కుమార్ వయస్సు 33 సంవత్సరాలు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన రెండేళ్ల కుమార్తె పేరిట ఒక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేశాడు. తన కుమార్తె ఉన్నత విద్యాభ్యాసమే లక్ష్యంగా పొదుపు పథకంలోకి ప్రవేశించాడు. అయితే అభిషేక్ తన కుమార్తె భవిష్యత్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయించవచ్చు. కానీ తన సొమ్మును రిస్క్ లేకుండా సేఫ్ గా ఉంచేందుకు సుకన్య సమృద్ధి యోజనవైపే మొగ్గు చూపాడు. అయితే ఈ ప్లానింగ్ వెనుక ఉన్న ఈ పథకానికి కేంద్రం కేటాయించిన అధిక వడ్డీ కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఈ డబ్బును ఒక లాంగ్ టెర్మ్ ప్రాతిపదికన పొదుపు చేయడం ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు విత్ డ్రా చేసుకునే వీలులేదు. తద్వారా తన కుమార్తె ఉన్నత విద్యాభ్యాసానికి సరిపడా పెద్ద మొత్తం అందుబాటులోకి వచ్చే వీలుంది.

అర్హతలేంటి ?
సుకన్య సమృద్ధి యోజన కింద పేరెంట్ లేద గార్డియన్ 0 నుంచి 10 సంవత్సరాల ఆడపిల్లల పేరిట ఈ అకౌంట్ ను తెరిచే అవకాశం ఉంది. ఒక బాలిక పేరిట ఒక ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంది. దత్తత తీసుకున్న బాలిక పేరిట కూడా అకౌంట్ తెరవవచ్చు. ఖాతాను మొదటి సారి తెరిచినప్పుడు కనిష్టంగా రూ.1000 డిపాజిట్ తో తెరవాల్సి ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిపాజిట్ చేసే అవకాశం ఉంది.

ప్రయోజనాలేంటి ?
అయితే ఈ అకౌంట్ ను 15 సంవత్సరాల వరకూ డిపాజిట్ చేస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. అయితే 15 సంవత్సరాల తర్వాత డిపాజిట్ చేయడానికి లేదు. డిపాజిట్లను సంవత్సరానికి ఒకసారి కానీ, మంత్లీ ప్రాతిపదికన కానీ డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసేది మాత్రం కుమార్తెకు 18 సంవత్సరాలు నిండిన అనంతరమే. అయితే ఈ అకౌంట్ ను కుమార్తెకు 21 సంవత్సరాలు వచ్చే వరకూ కొనసాగించే అవకాశం ఉంది. అప్పటి వరకూ అదే స్థాయిలో వడ్డీ ఇవ్వనుంది. అయితే సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకారం 2018 నుంచి అకౌంట్ ఓపెన్ చేసేందుకు మినిమం అమౌంట్ రూ.250 తగ్గించింది.

అభిషేక్ కుమార్ ప్రతీ క్వార్టర్ లో తన ఆదాయాన్ని సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్లను స్థిరంగా డిక్లేర్ చేసుకునే వీలుంది. తన కుమార్తె పేరిట ఓపెన్ చేసిన ఈ పథకానికి ఎలాంటి మార్కెట్ ఓలటాలిటీతో సంబంధం లేకుండా పొదుపు చేసేవీలు కలిగింది. అలాగే సుకన్య సమృద్ధి యోజన కింద పొదుపు చేసే రూ.1.5 లక్షలకు సెక్షన్ 80 సీ ఐటీ యాక్ట్ కింద టాక్స్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఈ పొదుపు మొత్తంపై వచ్చే వడ్డీకి ఎలాంటి ట్యాక్స్ కూడా వర్తించదు.

ఇప్పుడు మార్కెట్లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి ఇచ్చే సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో మంచిదనే చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com