భారత్ లో ట్రాయ్ కొత్త రూల్

- December 19, 2018 , by Maagulf
భారత్ లో ట్రాయ్ కొత్త రూల్

ఇండియా:ఇక నుంచి బులితెరపై కోరుకున్న ఛానల్, ప్యాకేజీలే చూడగలం. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రాకారం భారత్‌లో బుల్లితెర వినోదం మరింత భారం కానుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం టీవీ ఛానెళ్ల ప్రసారాలను వీక్షించేందుకు అదనంగా వినియోగదారుడు కేబుల్ ఆపరేటర్లకు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త టారిఫ్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

 
ఇప్పటివరకు కేబుల్‌ టీవీ అంటే, నెలకు ఇంతని చెల్లించి, వారు ప్రసారం చేసే చానళ్లు వీక్షించడమే. కానీ కొత్త నిబంధనల ప్రాకారం కేబుల్ టీవీ కనెక్షన్ కూడా ప్రీపెయిడ్‌ పద్ధతిలోనే చెల్లింపులు జరపాల్సి వస్తుంది. దీనివల్ల వినియోగదారులు తాము చూడదలచుకున్న చానళ్లకు మాత్రమే చెల్లింపులు జరిగే వీలు లభించనుంది.

డీటీహెచ్‌ అందించే సంస్థలతో పాటు కేబుల్‌ టీవీ నిర్వాహకులు కూడా జనవరి 1 నుంచి ట్రాయ్‌ ఆదేశాల ప్రకారమే సేవలు అందించడంతో పాటు ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రాయ్ కొత్త నిబంధనలు ప్రకారం అన్ని టీవీ నెట్‌వర్క్‌లు తమ ఛానెళ్లను వీక్షించేందుకు గాను ఒక సమిష్టి ధరను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్యాక్ ద్వారా తమ ఛానెళ్లను వీక్షించే అవకాశం ఉంది.

*మధ్యభారత దేశంలోని రాష్ట్రాల్లో అన్ని ఛానెల్స్ చూడలంటే నెలకు రూ.440 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
*ఇక మూడవ ఫేజ్, నాల్గవ ఫేజ్ పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు చెల్లించాల్సి ఉంటంది.
*250కి మించి ఛానెల్స్ వచ్చే ప్రాంతాల్లో రూ.350 నుంచి రూ.400 వరకు కేబుల్ ఆపరేట్లకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇటు డీటీహెచ్‌ సంస్థలు కూడా కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. వారు ప్రసారం చేసే చానళ్లకు విడివిడిగా ప్యాకేజీలుగా ధర నిర్ణయించి, వసూలు చేస్తున్నాయి. వీటికి ప్రీపెయిడ్‌ పద్ధతిలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. 1నెల, 3 నెలలు, 6 నెలలకు, 1సంవత్సరం పాటు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి ముందస్తుగా చెల్లింపులు జరిపి, ప్రసారాలు తిలకించే వీలుంది. ప్యాకేజీకు అనుగుణంగా కొంత డిసౌంట్ కూడా ఇస్తున్నాయి డీటీహెచ్ సంస్థలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com