డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
- December 20, 2018
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిరియా నుంచి తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు అన్యూహ్యంగా ప్రకటించారు. ఐసిస్‌ను పూర్తిగా ఓడించామని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తన హయాంలో ఇది సాధ్యమైందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ఐసీస్ అగడాలతో అట్టుడుకుతున్న భూమిని సైనిక చర్యలతో తిరిగి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు.
మరో వైపు ట్రంప్ ఆదేశాల మేరకు మిలటరీ దళాలను సిరియా నుంచి త్వరగా వెనక్కి రప్పిస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. సిరియాలో ఐసిస్‌ను మట్టుపెట్టేందుకు దాదాపు 2 వేల మంది అమెరికా సైనికులు అక్కడ గత కొన్ని నెలలుగా మకాం వేశారు. వీరిలో ఎక్కువ మంది స్పెషల్ ఆపరేషన్స్ దళాలకు చెందిన సైనికులే ఉన్నారు. సిరియా సైనికులతో కలిసి ఐసిస్‌ను అంతమొందించే కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.
త్వరలోనే సిరియా నుంచి అమెరికా దళాలనును ఉపసంహరించుకోనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో కూడా సంకేతాలిచ్చారు ట్రంప్. ఈ నేపథ్యంలో తాజాగా సిరియా నుంచి తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సైన్యాన్ని త్వరగా తిరిగి రావాలని రక్షణశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







