రిషబ్ చిట్ఫండ్ యజమాని అరెస్టు
- December 20, 2018
హైదరాబాద్: చిట్టీల పేరుతో ఖాతాదారుల నుంచి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసి పరారైన రిషబ్ చిట్ఫండ్ యజమానిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్, అతని భార్య నందినిని బోయగూడలోని వారి నివాసంలో గురువారం అదపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్లోని రిషబ్ చిట్ఫండ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారిద్ధరి సమక్షంలోనే సుమారు మూడు గంటల పాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారి అరెస్టు సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున శైలేష్ నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







