'మీ టూ' కు మోడీ భయపడ్డారా?
- December 20, 2018
ప్రధాని నరేంద్ర మోడీని బాలీవుడ్ ప్రముఖులు ముంబై రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సాధించిన ప్రగతి, పలు అంశాల గురించి విస్తృతంగా చర్చించామని మోడీ తెలిపారు. బాలీవుడ్ నిర్మాతలు రితేష్ సిద్వానీ, కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ కపూర్, రాకేష్ రోషన్, రోనీ స్క్రూవాలా, ప్రసూన్ జోషి తదితరులు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా.' చిత్ర పరిశ్రమ ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. సినీ రంగంలో జీఎస్టీ అమలు విధివిధానాలపై వారి విలువైన సలహాలు ఇచ్చారు' అంటూ సినీ ప్రముఖులతో దిగిన ఫొటోను మోదీ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ' సినీ రంగంలో కావాల్సినంత మంది మహిళలు ఉన్నారు. కానీ ప్రధానిని కలిసిన బృందంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం చాలా బాగుంది' అంటూ ఓ మహిళ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా. 'భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు పుట్టించినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రధానిని కలవడానికి అర్హులు కారేమో' అంటూ మరొకరు మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







