ద్రాక్ష పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు..
- December 21, 2018
ఈ కాలంలో ద్రాక్ష పండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పండ్లంటే నచ్చని వారుండరు. ద్రాక్ష పండ్లలో పలురకాలున్నాయి.. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభిస్తాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా వీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
1. చాలామంది తరచు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటివారు.. రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
2. ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ ద్రాక్ష పండ్ల రసాన్ని సేవిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
3. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచు పాలలో కలిపి తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు వైద్యులు.
4. ద్రాక్ష పండ్ల గుజ్జును వేరుచేసుకోవాలి. అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల నల్లటి ఛారలు, వలయాలు పోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
5. ద్రాక్ష పండ్లలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ సలాడ్ రూపంలో ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







