'దటీజ్ మహాలక్ష్మి' టీజర్ విడుదల.!
- December 21, 2018
కొంతకాలం క్రితం హిందీలో కంగనా రనౌత్ చేసిన చేసిన 'క్వీన్' మూవీ ఘన విజయాన్ని అందుకుంది. దాంతో సౌత్ లోని ఇతర భాషల్లోను ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి'అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. రాజమండ్రి దగ్గరలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫ్రాన్స్ వెళ్లిన మహాలక్ష్మికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహాలక్ష్మి అమాయకత్వం .. రాజమండ్రిపై ఆమెకి గల ప్రేమ .. విదేశీ సంస్కృతిలో ఇమడటానికి ఆమె పడిన ఇబ్బందులనే ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







