దమ్ముంటే బహిరంగ చర్చకు రా.. వర్మకు సవాల్
- December 22, 2018
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబుని కుట్రదారునిగా చిత్రీకరిస్తూ పాట విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో రాంగోపాల్‌వర్మ ఫ్లెక్సీలు, ఫోటోలను దగ్ధం చేశారు. రాజకీయ కారణాలతోనే వర్మ.. చంద్రబాబును టార్గెట్ చేశారంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఆడవాళ్లను కించపరిచేలా వ్యవహరించే వర్మకు.. లక్ష్మీపార్వతి మద్దతుగా నిలిచి ఎన్టీఆర్ పరువు తీస్తున్నారన్నారు. ముంబై, హైదరాబాద్‌లో దెబ్బలు తిన్నా వర్మకు బుద్ది రాలేదంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆదర్శవంతమైన ఘట్టాలున్నాయని.. వర్మ వాటిని ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబును కించపరిచేలా సినిమా ఉంటే వర్మకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







