విజయ్ దేవరకొండ ను కలవడానికి అమ్మాయిలు రాలేదట..ఎందుకో మరి చూడండి
- December 29, 2018
అతితక్కువ కాలంలో యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' మూవీలో నటిస్తున్న విషయం అందరికి విదితమే. కాకినాడ చుట్టుపక్కల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాదిసమ్మర్ ని స్పెషల్ గా నిలవనుంది. ఈ మూవీ కాకినాడ షెడ్యూల్ ముగింపుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన పెళ్లి పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాయి.
తన మనసు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అన్న సంకేతాలు ఇస్తే తాను అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని తనకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదని కాకినాడలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటె తనకు చెప్పండి అంటూ విజయ్ చేసిన కామెంట్స్ మీడియా వర్గాలకు షాక్ ఇచ్చాయి. అంతేకాదు హైదరాబాద్ లో లాగా తనను కలవడానికి కాకినాడలో ఎక్కువమంది అమ్మాయిలు తన వద్దకు రాలేదు అంటూ మరో సెటైర్ పేల్చాడు విజయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







