రాజమౌళి ఇంట పెళ్లి సందడి
- December 29, 2018
రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది.రాజమౌళి కుమారుడు కార్తికేయకు జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ వివాహం డిసెంబర్ 30న జరగనుంది. జైపూర్ లో మొఘల్ రాజుల భవనం స్టైల్లో ఉండే హోటల్ ఫెయిర్ మాంట్ లో జరుగుతుందట. ఇంద్రభవనం లాంటి ఈ 7 స్టార్ హోటల్ చాలా ఫేమస్. ఎన్నో బాలీవుడ్ చిత్రాల షూటింగ్ కూడా ఇందులో జరిగింది. దాదాపు 250 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ హోటల్ ఉంది. ఎలాగూ 7 స్టార్ హోటల్ కాబట్టి అన్నీ వివాహానికి హాజరయ్యే అతిథులకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి.
ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అతిథులందరూ శుక్రవారం జైపూర్ ప్రయాణం అయ్యారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, అనుష్క తదితరులు అతిథులుగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో 29 సాయంత్రం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. మెహందీ కార్యక్రమంలో 300మంది అతిథుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ లంచ్ హైలెట్‌గా ఉండబోతోందని సమాచారం. ఈ స్పెషల్ లంచ్‌లో రాజస్థానీ తాలీను గెస్ట్‌లందరికీ ప్రత్యేకంగా సర్వ్ చేయనున్నారట.
స్పెషల్ కార్డ్
స్టార్ హోటల్స్‌లోని రూమ్స్‌లోకి ప్రవేశించాలంటే రూమ్ కార్డ్ తప్పకుండా ఉండాల్సిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అతిథులందరికీ రూమ్‌ని అరేంజ్ చేస్తూ, ఓ స్పెషల్ రూమ్ కార్డ్‌ను ఏర్పాటు చేశారట రాజమౌళి ఫ్యామిలీ. ఎవరి రూమ్ కార్డ్‌కు వాళ్ల ఫొటోను జతపరిచారు. ఈ విషయాన్ని యన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకున్నారు. ''సంబరాలు మొదలయ్యాయి. ఇంతకంటే పర్సనల్ కీ దొరకదేమో'' అంటూ ఫ్యామిలీ ఫొటో ఉన్న రూమ్ కీ కార్డ్‌ను షేర్ చేశారు.

తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







