రెండ్రోజుల భారత్ బంద్
- January 07, 2019
రేపు, ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగనున్న భారత్ బంద్ లో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించారు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్ జనవరి 8-9 సమ్మెలో పాల్గొననుంది. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8-9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్రం పారిశ్రామికవేత్తలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. తమ 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆలిండియా కిసాన్ మహాసభ కూడా ట్రేడ్ యూనియన్ల దేశవ్యాప్త బంద్ ను స్వాగతించింది. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపట్టనున్నారు.
ఈ సమ్మె మోడీ సర్కార్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు ఈ ఆందోళనల్లో రైతులు కూడా పాలు పంచుకోనున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్ లో పాల్గొంటారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జనవరి 8-9న భారత్ బంద్ చేపట్టనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
కార్మిక సంఘాల భారత్ బంద్ పిలుపు మేరకు ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, మరో 30 ప్రజా సంఘాలు కూడా 8 జనవరిన అస్సాం బంద్ కు పిలుపునిచ్చాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ బంద్ లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. జనవరి 8న అస్సాంతో పాటు 7 ఈశాన్య రాష్ట్రాలు కూడా పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







