"వాట్సాప్ గోల్డ్ ఫీచర్"
- January 07, 2019
ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని.
ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని. ఇది వాట్సప్ కొత్తగా పెట్టిన అప్ గ్రేడ్ వర్షన్ అంటూ వాట్సప్ లో వెంటనే దీన్ని డౌన్ లోడ్ చేసుకోండని ఓ మెసేజ్ అందరికీ వస్తోంది. అయితే ఈ మెసేజ్ అంతా ఫేక్ తో కూడుకున్నది. మీరు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ మొబైల్ డేటా సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.
వాట్సాప్ గోల్డ్ ఫీచర్....
"వాట్సాప్ గోల్డ్ ఫీచర్" పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్ లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది. అందువల్ల మీకు అలంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి.
వాట్సాప్ ఈ ఏడాది 4 కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది.అవేంటో చూడండి
Consecutive Voice Messages
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్ ని ఆటోమేటిగ్గా ప్లే చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే అది ఆటోమేటిగ్గా వాయిస్ ని వినిపిస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. బీటావర్షన్ లో అందుబాటులో ఉంది.
డార్క్ మోడ్
కంపెనీ ఈ ఏడాది జనవరిలో ఈ ఫీచర్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కంటి సమస్యల నుండడి కొంత మేరకు గట్టెక్కే అవకాశం ఉంది. లో లైట్ కండిషన్లో కూడా ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
మీడియా ప్రివ్యూ
ఈ ఫీచర్ మీడియాను అయినా అల్లో చేసే విధంగా అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుంగానే ఫోటోలు, వీడియో, ఆడియో వంటి వాటిని వరుస క్రమంలో చూడవచ్చు.
కాంటాక్ట్స్ ర్యాంకింగ్
ఈ ఫీచర్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. మీరు కమ్యూనికేట్ అయ్యే యూజర్లు ఎంత ర్యాంకులో ఉన్నారనే విషయం ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చే. ఈ ఏాది వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







