కొత్తిమీర తీసుకుంటే....
- January 08, 2019
సాధారణంగా మనం వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాం. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
1. కొత్తిమీర యాంటీ-ఆక్సిడేంట్స్‌ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.
2. చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది.
3. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ కూడా కొత్తిమీరలో అధికంగా ఉంటాయి.
4. కొత్తిమీర ఆహారాన్ని రుచిగానే కాకుండా, జీర్ణక్రియ స్థాయిని కూడా పెంచును. అంతేకాకుండా అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆపుతుంది.
6. కొత్తీమీరను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన కిడ్నీలలో వచ్చే రాళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు మరియు పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు.
7. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







