హైదరాబాద్ లో 13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ
- January 08, 2019
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ వివరాలను సోమవారం సచివాలయంలో వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 దేశాలకు చెందిన 42 సంస్థల ప్రతినిధులు, 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కైట్ ఫెస్టివల్‌తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో.. వెయ్యి రకాల వంటకాలు ప్రదర్శిస్తామన్నారు. ఆగాఖాన్ అకాడమీతో సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..