కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!
- January 08, 2019
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జిల్లాలో విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సౌరవిద్యుత్ కోసం అల్ట్రా మెగా సోలార్ పార్క్ ను ప్రారంభిస్తారు. అనంతరం స్టేట్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్, ఫార్మా క్లస్టర్ కు సీఎం భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా కోసిగి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే జన్మభూమి కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







