నడిచే కారు... వచ్చేసింది

- January 09, 2019 , by Maagulf
నడిచే కారు... వచ్చేసింది

కార్ల దిగ్గజం హ్యుండాయ్ నడిచే కారును తయారు చేసింది. ప్రమాదకరమైన రహదారుల్లో ప్రయాణించేందుకు ఈ కూరును రూపొందించారు. మామూలు కారు రోడ్డుంటేనే ముందుకు సాగుతుంది. కొండలు గుట్టలు దానికి పనికిరావు. కానీ హ్యుండాయ్ లాస్‌వెగాస్‌లో ప్రదర్శించిన ఎలివేట్ కారు సాలీడులా పొడవాటి కాళ్లమీద నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే రోబోను, కారును సంకరం చేస్తే ఇది తయారైందని చెప్పొచ్చు. మనిషి కాలు తరహాలో కాళ్లు ఉండటం దీని ప్రత్యేకత. కరెంట్ తో ఇది నడుస్తుంది.

కొండలపైన లేదా మామూలుగా అయితే వెళ్లలేని ప్రదేశాల్లోకి అన్వేషణ కొరకు, ప్రమాదాల సమయాల్లో దీనిని పంపించవచ్చు. ఇది ఎక్కడికైనా సులభంగా వెళ్లగలుగుతుంది. విపత్తులు సమయంలో ఈ కారు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని హ్యుండాయ్ ప్రతినిధి జాన్ సూ చెప్పారు. దీని కాళ్ల చివరన చక్రాలు కూడా ఉంటాయి. రోడ్డు మామూలుగా ఉంటే చక్రాలమీద యథావిధిగా ఇది పరుగెడుతుంది. పొడవైన కాళ్లుండే జంతువుల నడక విధానాలను ఇది అనుకరిస్తుంది. వికలాంగులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
మెట్ల వల్ల చక్రాలకుర్చీ ఉపయోగానికి ఏర్పడే పరిమితులకు ఇది చెక్ పెడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com