రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- January 09, 2019
మస్కట్: ఇద్దరు ఒమనీ మహిళలు, సలాలాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సలాలా విలాయత్, అల్ రిబత్ స్ట్రీట్‌లో మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనీ, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కాగా, దోఫార్ మునిసిపాలిటీ అధికారులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్యారియర్ నిర్మించాల్సిన అవసరం వుందని ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. మినిస్ట్రర్ ఆఫ్ స్టేట్, గవర్నర్ ఆఫ్ దోఫార్ ఇప్పటికే సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ప్లానింగ్, అలాగే సంబంధిత అథారిటీస్‌కి కాంక్రీట్ బారియర్ విషయమై తెలియజేశారనీ, రిబత్ స్ట్రీట్ సెంటర్ ఐలాడ్ ప్రాముఖ్యతను తెలియజేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







