ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న చలి
- January 09, 2019
అమరావతి/తెలంగాణ: డిసెంబర్ చివరి వారం, ఆపై జనవరిలో రెండు, మూడు రోజుల తరువాత స్వల్పంగా తగ్గిన చలి మళ్లీ నిన్నటి నుంచి తన పంజాను విసురుతోంది. మంగళవారం నాడు ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, విశాఖపట్నంలో 13, తిరుమలలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమ, మంగళవారాల్లో రాత్రి భారీగా మంచు కురిసింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, ఆపై నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉండటమే చలి పెరగడానికి కారణమని, ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, మరికొన్ని రోజులు వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







