కాలేజీ ల్యాబ్‌లో దొంగతనం నిందితుడికి జైలు.!

కాలేజీ ల్యాబ్‌లో దొంగతనం నిందితుడికి జైలు.!

ఓ కాలేజీలో లేబరేటరీ కంప్యూటర్‌ మెయింటెనెన్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న వ్యక్తికి న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడు 41 ఏళ్ల బహ్రెయినీ వ్యక్తి. కాలేజీలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న నిందితుడు కంప్యూటర్లను, ప్రింటర్లను, ల్యాప్‌ ట్యాప్‌లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫస్ట్‌ హై క్రిమినల్‌ కోర్ట్‌ నిందితుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది. 

 

Back to Top