భారత కార్మికుల్ని దుబాయ్‌లో కలిసిన రాహుల్ గాంధీ.!
- January 11, 2019
దుబాయ్:భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల యుఎఈ పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రాహుల్‌గాంధీని కలిసేందుకు పెద్ద ఎత్తున భారతదేశానికి చెందిన బ్లూ కాలర్డ్ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వారినుద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. మీరు ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. స్వదేశంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న కష్టం నేను అర్ధం చేసుకోగలను. మీకు నేను అందించగలిగే సహాయం, అది ఎలాంటిదైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రాహుల్ గాంధీ. రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ దుబాయ్‌లో భారతదేశానికి చెందిన పలు గ్రూప్స్‌తో సమావేశమవుతారు. ఇదిలా ఉంటే రాహుల్ పర్యటన పట్ల దుబాయ్‌లో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పందన తాము ఊహించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







