సీబీఐ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్‌రావు

సీబీఐ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్‌రావు

సీబీఐ డైరక్టర్‌గా నాగేశ్వర్‌రావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ అలోక్ వర్మను డైరక్టర్ హోదా నుంచి తప్పించడంతో.. ఆయన స్థానంలో నాగేశ్వర్‌రావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు.. అలోక్ వర్మను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మరో స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానాతో వివాదం చెలరేగిన కారణంగా.. ఇటీవల అలోక్ వర్మను సెలవుపై పంపించారు. కానీ ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. అలోక్ వర్మ లీవులో ఉన్న అక్టోబర్‌లో నాగేశ్వర్‌రావు తాత్కాలిక చీఫ్‌గా కొనసాగారు. నాగేశ్వర్‌రావు 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్‌. అక్టోబర్ 23వ తేదీన ఆయన తెల్లవారుజామున 2 గంటలకు నాటకీయ పద్ధతిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Back to Top