కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ప్రమాదం ఒకరికి తీవ్రగాయాలు

కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ప్రమాదం ఒకరికి తీవ్రగాయాలు

విలాయత్‌ సీబ్‌లోని అల్‌ఖౌద్‌ ప్రాంతంలోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. భూమిని తవ్వుతుండగా,మట్టి మీద పడి అందులో ఇరుక్కుపోయాడో కార్మికుడు. సమాచారం అందుకున్న సివిల్‌ డిఫెన్స్‌, అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యంత్రాల సాయంతో బాధితున్ని బయటికి తీశారు. తక్షణ వైద్య సహాయం అందించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. బాధితుడిని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సంఘటనకు బాధ్యుడిగా బిల్డింగ్‌ ఓనర్‌పై కేసు నమోదు చేశారు. 

Back to Top