డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ పోస్తులు
- January 18, 2019
కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సహస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ), అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు : 398
విభాగాల వారీగా ఖాళీలు
బీఎస్‌ఎఫ్: 60
సీఆర్‌పీఎఫ్: 179
సీఐఎస్ఎఫ్: 84
ఐటీబీపీ: 46
ఎస్ఎస్‌బీ: 29
విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాల కలిగి ఉండాలి.
వయసు: 01.08.2018 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత పరీక్ష, పీఈటీ పరీక్షల ఆధారంగా
రాత పరీక్ష విధానం..
మొత్తం 450 మార్కులకు యూపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షల్లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ & ఇంటిలిజెన్స్. పేపర్ 2లో జనరల్ స్టడీస్, కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 28.01.2019 సాయింత్రం 6 గంటల వరకు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







