నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి...

- January 18, 2019 , by Maagulf
నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి...

మనం నిత్యం అనేక రకములైన కూరగాయలను వాడుతుంటాము. మన ఆరోగ్యానికి శ్రేయస్సును చేకూర్చే పోషకాలు ఒక్కో కూరగాయలో వేరువేరుగా ఉంటుంది. మనం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. అంతేకాకుండా ముల్లంగిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శృంగార పరమైన సమస్యలు తగ్గుతాయి. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషద గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి.

2. నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.

3. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి.
4. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి.

5. ఇటీవల కాలంలో మగవారిలో శృంగార సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అలాంటివారు ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవుపాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే సమస్య తగ్గుతుంది.

6. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా బాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాదులు తగ్గుతాయి.
7. నిత్యం 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com