బ్రిటన్ రాజు కారుకు ప్రమాదం
- January 18, 2019
బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్(97) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రిన్స్ ఫిలిప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తూర్పు ఇంగ్లాండ్‌లోని సాంద్రింఘం ఎస్టేట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదస్థలిలో ఫిలిప్ కారు ల్యాండ్ రోవర్ రహదారి వైపు తిరిగినట్లు పడి ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ప్రధాన రహదారి నుండి కిందకు దిగిన కారు తిరిగి ఎక్కించే క్రమంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొట్టినట్లుగా స్థానికుడు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యువరాణి ఎలిజబెత్ కూడా కారులో ఉన్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







