బ్రిటన్ రాజు కారుకు ప్రమాదం

- January 18, 2019 , by Maagulf
బ్రిటన్ రాజు కారుకు ప్రమాదం

బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్(97) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రిన్స్ ఫిలిప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తూర్పు ఇంగ్లాండ్‌లోని సాంద్రింఘం ఎస్టేట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదస్థలిలో ఫిలిప్ కారు ల్యాండ్ రోవర్ రహదారి వైపు తిరిగినట్లు పడి ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ప్రధాన రహదారి నుండి కిందకు దిగిన కారు తిరిగి ఎక్కించే క్రమంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొట్టినట్లుగా స్థానికుడు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యువరాణి ఎలిజబెత్ కూడా కారులో ఉన్నట్లు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com