సీక్రెట్‌గా మెయింటైన్ చేసిన మీ వాట్సాప్ ఛాటింగ్ మొత్తం..
- January 18, 2019
చాటు మాటుగా సాగించే వాట్సాప్ ఛాటింగ్ వ్యవహారం మొత్తం ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది. కొంప కొల్లేరయ్యేలా ఉంది. వెంటనే సిమ్ మార్చేస్తే సరి. అర్జంట్‌గా పాత సిమ్ పడేసి కొత్త సిమ్ వేయించుకుంటే ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా ఉంటుంది.. అని అస్సలు అనుకోవడానికి వీల్లేదండి. మీ బాగోతం మొత్తం మీ పాత నెంబర్ తీసుకున్న కొత్త వ్యక్తికి తెలిసిపోతుందట. దీన్ని రుజువు చేస్తూ అందుకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
సాధారణంగా ఓ నెంబర్ని కొంత కాలం పాటు వాడకుండా మూలన పడేస్తే, దాన్ని ఇతరులకు కేటాయించే హక్కు టెలికాం కంపెనీలకు ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ కొత్త ట్విస్ట్ ఏంటంటే.. అప్పట్లో ఆ నెంబర్ నుంచి ఎవరితో ఛాటింగ్ చేసామో ఆ ఛాట్ హిస్టరీ మొత్తం ఆ నెంబర్ కొత్తగా ఇవ్వబడిన కొత్త వ్యక్తికి తెలిసిపోతుందట.
అలా ఎలా జరుగుతుందని ఆరా తీస్తే.. గూగుల్ లేదా ఫేస్బుక్ వంటి అకౌంట్ల ఆధారంగా కాకుండా వాట్సప్ కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా పని చేయడం వలన, మనం చేసే ఛాట్ సంభాషణలు మన ఫోన్ నెంబర్‌తో లింక్ చేయబడి ఉంటున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన డేటా మొత్తం ఫోన్లో గానీ, లేదా మన గూగుల్ డ్రైవ్ అకౌంట్లో గానీ బ్యాకప్ తీయబడుతూ ఉంటుంది తప్పించి వాట్సప్ సర్వర్‌లో డెలివరీ చెయ్యబడని కొద్ది మొత్తంలో డేటా మాత్రమే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఎలా చోటు చేసుకుంటున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. లేదంటే మన ఛాట్ సంభాషణ మొత్తం వాట్సప్ దగ్గర ఉంటున్నాయేమో అన్న అనుమానం కూడా వస్తోంది.
ఏది ఏమైనా ఇకపై వాట్సప్ సంస్థ పాత నెంబర్ తొలగించి కొత్త నెంబర్‌కి మారాలనుకునే వారు యాప్ ఓపెన్ చేసి Change Number అనే ఆప్షన్ ద్వారా తమ అకౌంట్ మొత్తాన్ని కొత్త నెంబర్‌కి మైగ్రేట్ చేసుకుంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని సలహా ఇస్తోంది. తనకు ఇలాగే జరిగిందని అబే ఫుల్లర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







