ఇంటర్ అర్హతతో సిఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు
- January 19, 2019
పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
పని చేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
మొత్తం ఖాళీలు: 429 (జనరల్-222, ఓబీసీ-114, ఎస్సీ-63, ఎస్టీ-30)
వీటిలో పురుషులకు 328, మహిళలకు 37, ఎల్‌డీసీఈ-64 పోస్టులు కేటాయించారు.
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయసు: 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్: లెవల్ 4 ప్రకారం రూ.25,500 – 81,100/- ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్ఏ తదితరాలు ఉంటాయి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు 167 సెం.మీ, మహిళలు 155 సెం.మీ ఉండాలి.
ఛాతి: పురుషులు 77 సెం.మీ, గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు సరిపడా ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పీఎస్‌టీ, స్కిల్ టెస్ట్ ద్వారా
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటిలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్
- ADVT -
ఇంగ్లీష్/హిందీ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. 2 గంటల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.
పరీక్షలో అర్హత మార్కులు, జనరల్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. హార్డ్‌కాపీలను సంబంధిత రీజినల్ ప్రాంతీయ కార్యాలయానికి పంపాలి.
చిరునామా: DIG,CISF (SOUTH ZONE), RAJAJI BHAAN, D BLOCK, BESANT NAGAR, CHENNAI-600090
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20
వెబ్‌సైట్: https://cisfrectt.in
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







