ఆమెతో ఆదివారాలు కూడా.. అందుకు రూ.152 కోట్లు..

- January 19, 2019 , by Maagulf
ఆమెతో ఆదివారాలు కూడా.. అందుకు రూ.152 కోట్లు..

అమెరికా:ఆదివారం సెలవు తీసుకున్నందుకు విషయం తెలిసిన మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించారు. దానికి ఆమె కోర్టులో కేసు వేసింది. హోటల్ సిబ్బంది ఆమెకు క్షమాపణతో పాటు 21 మిలియన్ డాలర్లకు పైగా జరిమానా కూడా కట్టవలసిన పరిస్థితి వచ్చింది.

 
ఫ్లోరిడాలోని మియామీ నగరానికి వలస వచ్చింది హైతీకి చెందిన మేరీ జాన్ అనే మహిళ. ఆమె అక్కడి స్థానిక ఫైవ్‌స్టార్ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఒక్క ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజుల్లో పనికి వచ్చేది. ఆదివారాల్లో ఆమె చర్చికి వెళ్లి అక్కడ తన సేవలను అందించేది.

సిబ్బంది ఒకరికి ఒకరు మాట్లాడుకుని మేరీ ఆదివారం రాకపోయినా అడ్జస్ట్ చేసుకునేవారు. అయితే హోటల్ మేనేజర్‌కి మేరీ ఆదివారాలు రావట్లేదని తెలిసింది. ఆమెను పిలిచి మందలించారు. ఆదివారం కూడా ఖచ్చితంగా రావలసిందే అని అన్నారు. దానికి మేరీ అంగీకరించకుండా చర్చి ఫాదర్‌కి విషయాన్ని వివరించి ఓ లేఖ రాయించుకుంది.

ఆదివారం పనిచేయించుకుంటే మతాన్ని అవమానించినట్లవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను తీసుకెళ్లి మేరీ హోటల్ మేనేజర్‌కి ఇచ్చింది. అయినా మేనేజర్ మనసు కరగలేదు. వారంలో ఒక రోజైన ఆదివారం సెలవిమ్మంటే కుదరదన్నారు. అవసరం తనదనుకుని ఆదివారం కూడా వచ్చేది. అలాగే పదేళ్ల పాటు ఆదివారాలు కూడా పని చేస్తు వచ్చింది.

అప్పుడప్పుడు సిబ్బంది సహాయంతో ఆదివారం సెలవు తీసుకునేది. మేనేజర్‌కి మేరీ సెలవు తీసుకుంటున్న విషయం తెలిసింది. ఉద్యోగానికి రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో మేరీ ఈఈఓసీని ఆశ్రయించింది. మతం పట్ల తనకున్న నమ్మకాన్ని గౌరవించకుండా అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని కోర్టులో ఫిర్యాదు చేసింది.

న్యాయస్థానం తీర్పు మేరీకి అనుకూలంగా వచ్చింది. మేరీ మనోభావాలను దెబ్బతీసినందుకుగాను హోటల్ యాజమాన్యం 21.5 మిలియన్ డాలర్ల (మన ఇండియన్ కరెన్సీలో రూ.152 కోట్లు)కు పైగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. దానికి హోటల్ సిబ్బంది.. మేరీకి అనుకూలంగానే షిప్ట్‌లు వేసినా నిజా నిజాలు తెలుసుకోకుండా తీర్పు వెలువరించడం భావ్యం కాదని వాపోతోంది. చేసేదేంలేక అంత మొత్తం నగదు ఇవ్వడానికి అంగీకరించి మేరీని మళ్లీ విధులకు హాజరవమంటూ ఆహ్వానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com