సచివాలయం విజయవాడకు తరలిస్తామని...
- December 26, 2015
జూన్ లోపు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం మొత్తాన్ని విజయవాడకు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సచివాలయానికి కావలసిన 6లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో 12 లక్షల 42 వేల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలలోపు అందరికీ రేషన్ కార్డులు అందచేస్తామని, రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రానున్న 90 రోజులలో రోజుకు 5 కిలోమీటర్లు చొప్పున రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







