28నుంచి హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌

- January 26, 2019 , by Maagulf
28నుంచి హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌

హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఈ నెల 28వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు అమెరికా తెలిపింది. పెండింగ్‌లో ఉన్న వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు గతంలో అమెరికా హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపేసింది. మాస్టర్స్‌ కోటాలో ప్రీమియం ప్రాసెసింగ్‌ దరఖాస్తులతో పాటు రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ అందిన వారు తమ స్పందనను కూడా జత చేసి దరఖాస్తు చేసుకోవాలి అని యూఎస్‌ వెల్లడించింది. ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా కంపెనీలు, దరఖాస్తుదారులు వేసిన పిటిషన్లను వేగంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. 15రోజుల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అమెరికా ఏటా 85వేల హెచ్‌-1బీ వీసాలు ఇస్తోంది. అక్కడి కంపెనీలు ఈ వీసా ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. హెచ్‌-1బీ వీసాలు పొందే వారిలో అత్యధికంగా భారతీయులే. 2017లో ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక హెచ్‌-1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com