వాట్సప్ వెబ్ వినియోగదారులకు ఈ ఫీచర్ వచ్చింది

- January 27, 2019 , by Maagulf
వాట్సప్ వెబ్ వినియోగదారులకు ఈ ఫీచర్ వచ్చింది

కేవలం ఆండ్రాయిడ్ మరియు ఐ ఫోన్ లలో మాత్రమే కాదు.. రోజు మొత్తం మీద అధిక సమయం కంప్యూటర్ మీద గడిపేవారు కూడా, చేతిలోకి ఫోన్ తీసుకోవాల్సిన పని లేకుండా, తమ కంప్యూటర్లోనే వాట్సప్ ఛాటింగ్ చేసుకోవడం కోసం Whatsapp Web సర్వీస్ వాడతారు అన్న విషయం తెలిసిందే.
అయితే వాట్సప్ సంస్థ ఏదైనా కొత్త సదుపాయం ప్రవేశపెట్టినప్పుడు, అది మొట్టమొదట iOS మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే డివైస్ లకు మాత్రమే అందుబాటులోకి తీసుకు వస్తుంది. అది వచ్చిన కొన్ని నెలలకు మాత్రమే Whatsapp Webకి పరిచయం చేయబడుతుంది.
సరిగ్గా ఇదే విధంగా తాజాగా వాట్సాప్ వెబ్ వాడుతున్న వారికి Picture in Picture ఫీచర్ ప్రవేశపెట్టబడింది. వాట్సప్ వెబ్ 0.3.2041 వెర్షన్‌లో ఇది చోటు చేసుకుంది. దీంట్లో భాగంగా అనేక కొత్త ఇంప్రూవ్‌మెంట్స్, సెక్యూరిటీ ఫిక్స్‌లు ప్రవేశపెట్టబడ్డాయి. Picture in Picture సదుపాయం ప్రస్తుతం వివిధ వీడియో హోస్టింగ్ సర్వీసులకు సంబంధించిన వీడియోలను సపోర్ట్ చేయగలుగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి వివిధ ఆన్లైన్ వీడియో సర్వీసులకు సంబంధించిన ఏదైనా వీడియో మీ స్నేహితులు మీకు షేర్ చేసినప్పుడు, దాన్ని చూడడం పూర్తయ్యేంతవరకు ఛాట్‌లో కొనసాగాల్సిన పనిలేకుండా, ఓ పక్క దాన్ని చూస్తూనే ఆ ఛాట్ నుండి బయటకు వచ్చి ఇతరులతో చాటింగ్ కొనసాగించడానికి ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ సదుపాయం ఉపయోగపడుతుంది.
అతి త్వరలో వాట్సాప్ డెస్క్టాప్ అప్లికేషన్ వాడుతున్న వారికి కూడా ఇది అందుబాటులోకి రాబోతోంది. ఎవరు మీరు వాడుతున్న గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లలో ఈ కొత్త పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ గనుక ఇప్పటికీ రాకపోతే, వెబ్ సైట్ రిఫ్రెష్ చేయండి, అప్పటికీ ఫలితం లేకపోతే ఒకసారి మీ బ్రౌజర్ క్యాఛేని క్లియర్ చేస్తే సరిపోతుంది, ఆ ఆప్షన్ కచ్చితంగా వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com