భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC

- January 28, 2019 , by Maagulf
భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC

హైదరాబాద్‌: నగరంలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ఆకాలవర్షాలతో నగరవాసులకు ఏ విధమైన ఇబ్బందులూ కలగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. భారీవర్షం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌తో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. నగరంలోని వాతావరణ పరిస్థితులు, పౌర సమస్యలపై కమిషనర్‌తో సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ విపత్తుల నివారణ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటితో కలిసి ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, రాజ్‌భవన్‌రోడ్‌, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై వరదనీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్‌ సూచించారు. జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండటంతోపాటు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ మూడు షిఫ్టులుగా పనిచేస్తునట్లు తెలిపారు. జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హైదరాబాద్ వాసులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com